CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ విగ్రహావిష్కరణకు అగ్రనేతలను పిలవనున్న కాంగ్రెస్ నేతలు, పీసీసీ చీఫ్ ఎన్నికపై రానున్న క్లారిటీ!

హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు రేవంత్ రెడ్డి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు అగ్రనేతలు

CM Revanth Reddy Delhi Tour Updates, to meet Congress Leader Sonia Gandhi And Rahul Gandhi

Hyd, Aug 23: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు రేవంత్ రెడ్డి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించనున్నారు రేవంత్. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు రేవంత్ .

సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోనియాగాంధీతో భేటీ కానున్నారు. అనంతరం మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయి పీసీసీ చీఫ్ ఎన్నికపై చర్చింనున్నారు. అలాగే కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతులకు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించనున్నారు.

రైతులకు రుణాలు మాఫీ చేసినందుకుగాను వరంగల్ లో భారీ బహిరంగసభను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ రైతు అభినందన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు.కాంగ్రెస్ అగ్రనేతలు ఇచ్చే తేదీలను భట్టి బహిరంగసభ డేట్‌ని ప్రకటించనున్నారు. ఓవ‌ర్ లోడ్ అయిన బస్సు, నేను న‌డ‌ప‌లేను బాబోయ్ అంటూ న‌డిరోడ్డుపైనే నిలిపివేసిన ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్, 55 మంది ఎక్కాల్సింది ఏకంగా 110 మంది ఎక్కారంటూ ఆవేద‌న‌ 

సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కూడా హస్తినకు వెళ్లనున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఖచ్చితంగా క్లారిటీ రానుందని హస్తం నేతలు భావిస్తున్నారు. త్వర‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ నియామకంపై ఖచ్చితంగా క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.



సంబంధిత వార్తలు