Telangana Diksha Divas: తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.. దీక్షా దివస్, కేసీఆర్ చచ్చుడో - తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ఆమరణ దీక్ష..రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌లో బీఆర్ఎస్ శ్రేణులు

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.

Deeksha Divas watershed moment in Telangana history, Harishrao tweet on Deeksha Divas(BRS X)

Hyd, Nov 29: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ నవంబర్ 29, 2009న చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని పతకా స్థాయికి చేర్చిన రోజు నవంబర్ 29. 2009లో ఇదే రోజు కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. తెలంగాణ ఏర్పాటుకు కీలకమలుపు. ఆరు దశాబ్దాల స్వప్నమైన తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్రం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి చివరకు ఆమరణ దీక్షనే అస్త్రంగా సంధించారు కేసీఆర్.

సిద్దిపేటలో దీక్ష ప్రారంభిస్తున్న కేసీఆర్ ప్రకటించి కరీంనగర్ నుంచి సిద్దిపేటవైపు కదిలారు. కరీంనగర్ శివారు దాటకముందే అరెస్టు చేసి ఖమ్మం జిల్లా కేంద్ర కారాగారానికి తరలించింది. కేసీఆర్ జైలులోనే దీక్ష ప్రారంభించినట్టు ప్రకటించడంతో రాష్ట్రం అట్టుడికి పోయింది. ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చారు.

చివరకు కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణను ప్రకటించింది.

కేసీఆర్ త్యాగాల ఫలమే అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్‌ గారు తెగించిన రోజు నేడు అని ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు హరీశ్‌ రావు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి..స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం అన్నారు.  నేడు తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్‌’.. కరీంనగర్ లో పాల్గొననున్న కేటీఆర్ 

Here's Tweet:

ఇన్నేళ్ళు గడిచినా ఆ నాటి పరిస్థితులు ఇంకా నా ముందు కదలాడుతూనే ఉన్నాయి. కేసీఆర్ గారి చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైందని...మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు తన ‘The Coalition Years: 1996-2012’ పుస్తకంలో కెసిఆర్ గారి నిబద్ధత గురించి ఇలా ప్రస్తావించారు అన్నారు.

కేంద్ర మంత్రిగా మీకు ఏ శాఖ కేటాయించాలి అని అడిగినప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన సమాధానం.. ప్రణబ్‌జీ, నా లక్ష్యం మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరు నాకు ఏ శాఖను కేటాయించారనేది ముఖ్యం కాదు. మీరేది కేటాయించినా నాకు సమ్మతమే. కానీ దయచేసి తెలంగాణను ఇవ్వండి.” ఇదీ కేసీఆర్ అంటే. ఇదీ ఆయన కమిట్మెంట్ అన్నారు. కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ. కెసిఆర్ ఉద్యమ ఫలితం తెలంగాణ అని వెల్లడించారు.



సంబంధిత వార్తలు

Harishrao: కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు..దొంగలను తిరిగి పార్టీలోకి చేర్చుకోమన్న హరీశ్ రావు...కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదు..టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించామన్న హరీశ్

Balineni Slams YS Jagan: జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని, జగన్ హయాంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారంటూ..

Bank Holidays in December 2024: డిసెంబర్‌లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఇదిగో, ఈ నెలలో పనిచేసేది కొన్ని రోజులే కాబట్టి అలర్ట్ కాక తప్పదు

Telangana Diksha Divas: తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.. దీక్షా దివస్, కేసీఆర్ చచ్చుడో - తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ఆమరణ దీక్ష..రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌లో బీఆర్ఎస్ శ్రేణులు