KCR Speech (photo-Video Grab)

Hyderabad, Nov 29: తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్‌ (Deeksha Diwas)) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది. ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు రెడీ అయ్యాయి. తెలంగాణభవన్‌ లో దీక్షా దివస్‌ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురువారం పరిశీలించారు. కరీంనగర్ లో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమంలో నేడు ఆయన పాల్గొననున్నట్టు సమాచారం.

ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా

ఏమిటీ దీక్షా దివస్?

సబ్బండ జాతులను ఏకం చేసి మలిదశ తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చేలా నవంబర్‌ 29న కేసీఆర్‌ దీక్షను చేపట్టారు. దీన్ని దీక్షా దివస్ గా పిలుస్తున్నారు. ఈ దీక్షకు గుర్తుగా వరంగల్‌ గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఆవరణలో దీక్షాదివస్‌ పైలాన్‌ ను ఏర్పాటు చేశారు. కాగా, ఈ దీక్ష అనంతరమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సాకారమైన విషయం తెలిసిందే.

ఫెంగల్ తుఫాను ముప్పు, సహాయక చర్యల కోసం అప్రమత్తమైన భారత నౌకాదళం, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలను వణికించనున్న సైక్లోన్