Breaking News, ED arrested CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేసిన ఈడీ...ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ..
సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట లభించలేదు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట లభించలేదు.
ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ విధంగా టార్గెట్ చేయడం పూర్తిగా తప్పు, రాజ్యాంగ విరుద్ధం అని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఈ విధంగా రాజకీయాల స్థాయిని తగ్గించడం ప్రధానమంత్రికి గానీ, ఆయన ప్రభుత్వానికి గానీ తగదన్నారు. ఎన్నికల రణరంగంలోకి దిగి పోరాడడం. వారితో ధైర్యంగా పోరాడడం, వారి విధానాలు, పని తీరుపై దాడి చేయడం - ప్రజాస్వామ్యం అంటే ఇదే..
అయితే ఈ విధంగా దేశంలోని అన్ని సంస్థల అధికారాన్ని ఉపయోగించి మీ రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి, వారిపై ఒత్తిడి తెచ్చి, బలహీనపడడం ప్రజాస్వామ్యంలోని ప్రతి సూత్రానికి విరుద్ధం.. దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం, అన్ని రాజకీయ పార్టీలు, వాటి నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ నుంచి రాత్రి పగలు ఒత్తిళ్లు, స్వతంత్ర దేశ చరిత్రలో ఇలాంటి అవమానకర దృశ్యం తొలిసారిగా కనబడుతోందని ప్రియాంక అన్నారు.