Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కేసు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ నవంబర్ 20కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నవంబర్ 20కు వాయిదా పడింది. అక్టోబర్ 18న పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. ఆ తర్వాతే దీనిపై విచారణ చేపడతామని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కేసులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నవంబర్ 20కు వాయిదా పడింది. అక్టోబర్ 18న పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. ఆ తర్వాతే దీనిపై విచారణ చేపడతామని తెలిపారు.
అప్పటివరకు ప్రస్తుతం అమలులో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పటివరకు కవితను విచారణకు పిలవబోమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. మహిళలు ఏ స్థాయిలో ఉన్నవారనేది పక్కనబెడితే.. విచారణకు అసలు పిలవద్దంటే ఎలా? అని జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్ ప్రశ్నించారు. అయితే మహిళల విచారణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న ధర్మాసనం.. తదుపరి విచారణ నవంబర్ 20న చేపడతామని పేర్కొంది.