Hyderabad Blasts Conspiracy Case: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర కేసు, 11 మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించిన ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు

ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్‌ ఉర్‌ రెహమాన్‌తో పాటు 10 మందికి జైలు శిక్ష ఖరారు చేసింది ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.

NIA (Photo-ANI)

హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర కేసులో పదకొండు మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ ఎన్‌ఐఏ(National Investigation Agency)కోర్టు. ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్‌ ఉర్‌ రెహమాన్‌తో పాటు 10 మందికి జైలు శిక్ష ఖరారు చేసింది ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చి పేలుళ్లకు ఒబెద్‌ కుట్ర పన్నాడు.

తెలంగాణ పోలీసులు ఆ కుట్రను ముందుగానే భగ్నం చేశారు. ఒబెద్‌ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టు విచారణలో తేలింది. ఇక ‘ముజాహిద్దీన్‌ కుట్ర’గా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో సయ్యద్‌ ముక్బుల్‌ను సెప్టెంబర్‌ 22వ తేదీన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్నాడు ముక్బుల్‌. నాందేడ్‌కు చెందిన ముక్బుల్‌ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన అరెస్ట్‌ చేశారు. పాక్‌ ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్‌లోని కీలక సభ్యులతో ముక్బుల్‌ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ అధికారులకు మరణ శిక్ష విధించిన ఖతార్ కోర్టు, విదేశాంగ స్పందన ఏంటంటే..

2012లో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు పేలుడు పదార్థాలు తీసుకొచ్చి దాడులకు యత్నించిన కేసులో ఎన్‌ఐఏ ఇప్పటివరకూ 11 మందిని అరెస్టు చేసింది. వీరిలో నలుగురు నిందితులకు జులైలో.. న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. తాజగా మరో నిందితుడు మక్బూల్‌కు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.  నిందితులు హైదరాబాద్‌ లక్ష్యంగా పేలుళ్లకు కుట్రపన్నారని, పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని ఎన్‌ఐఏ అధికారులు కోర్టుకు తెలిపారు.