Disproportionate Assets Case: శివ బాలకృష్ణను సస్పెండ్ చేసిన HMDA, 8 రోజుల ఏసీబీ కస్టడీకి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ

శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు

Ex-HMDA Director Shiva Balakrishna suspended Fron HMDA now In ACB Remand For 8 Days (Photo-File Image)

Hyd, Jan 30: హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అరెస్ట్ అయి అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.కాగా ఆదాయనికి మించి ఆస్తుల కేసులో (Disproportionate Assets Case) శివబాలకృష్ణ అరెస్ట్‌ అయిన సంగతి విదితమే. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తులు, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు 14 రోజుల రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు

నేడు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Ex-HMDA Director Shiva Balakrishna) కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మంగళవారం విచారణ జరిపింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా, 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలన్న ఏసీబీ.. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. అధికారులను సైతం ఏసీబీ విచారించనుంది.హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీయనుంది.

Here's suspends Letter

పుప్పాలగూడ 447సర్వే నంబర్‌లో అనుమతులపై సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు. బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే అక్రమ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్