Fire Accident In Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. సమయానికి స్పందించడంతో తప్పిన ముప్పు (వీడియో)

హైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఓ బిల్డింగ్‌ లోని సెల్లార్ లో ఆదివారం వేకువజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Major Fire Breaks Out (Video grab)

Hyderabad, Feb 2: హైదరాబాద్ (Hyderabad)) లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు (Fire Accidents) నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఓ బిల్డింగ్‌ లోని సెల్లార్ లో ఆదివారం వేకువజామున  అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ కిందనున్న సెల్లార్ లో మంటలు చెలరేగి పై అంతస్తుల్లోకి క్రమంగా వ్యాపించాయి. అయితే, ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయడంతో వాళ్లు వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బిల్డింగ్ మొత్తం పొగ చూరిపోయింది.  ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమన్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల లక్ష్మీనృసింహస్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)

మొన్న తుక్కు గోదాంలో..

పాతబస్తీలో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోయాయి. మాదన్నపేట చౌరస్తాలోని ఓ తుక్కు గోదాంలో నెలరోజుల క్రితం ఇలాగే మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు ఆరు గంటల సమయం పట్టింది. రానున్న వేసవికాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, కుల గణన నివేదికను సభ ముందు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement