Fire Accident In Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)

హైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

Fire (Representational image) Photo Credits: Flickr)

Hyderabad, Feb 10: హైదరాబాద్ (Hyderabad) లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు (Fire Accidents) నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. దివాన్‌ దేవిడిలో నాలుగు అంతస్తుల భవనంలో మంటలు అంటుకున్నాయి. దీంతో 10 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని ప్రమాద ఘటనలో 40 టెక్స్‌ టైల్‌ షాపుల్లో వస్త్రాలు పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. కాగా వారంపదిరోజుల క్రితం పాతబస్తీలోని కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఓ బిల్డింగ్‌ లోని సెల్లార్ లో ఇటీవల  అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ కిందనున్న సెల్లార్ లో మంటలు చెలరేగి పై అంతస్తుల్లోకి క్రమంగా వ్యాపించాయి. అయితే, ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయడంతో వాళ్లు వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బిల్డింగ్ మొత్తం పొగ చూరిపోయింది.  ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమరావతి కోసం కలలు కనడం తప్పా మీరు చేసింది ఏమిటీ ? సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన కురసాల కన్నబాబు

Here's Video:

నెల కిందట తుక్కు గోదాంలో..

పాతబస్తీలో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోయాయి. మాదన్నపేట చౌరస్తాలోని ఓ తుక్కు గోదాంలో నెలరోజుల క్రితం ఇలాగే మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు ఆరు గంటల సమయం పట్టింది. రానున్న వేసవికాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

వీడియో ఇదిగో, ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేక టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ప్రస్తుతం చావు బతుకుల్లో..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement