Hyderabad Shocker: తార్నాకలో దారుణం, అనారోగ్యంతో ఉన్న పిల్లలను చూడలేక సైనేడ్ ఇచ్చి చంపిన తల్లిదండ్రులు, అనంతరం విషం తాగి ఇద్దరూ ఆత్మహత్య
ఓ ఇద్దరు సాఫ్ట్‌వేర్ దంపతులు( Software Couples ) తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి.. అనంతరం ఆత్మహత్య( Suicide ) చేసుకున్నారు. ఈ విషాద ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్( Kushaiguda Police ) పరిధిలోని కందిగూడలో చోటు చేసుకుంది.
Hyd, Mar 25: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇద్దరు సాఫ్ట్‌వేర్ దంపతులు( Software Couples ) తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి.. అనంతరం ఆత్మహత్య( Suicide ) చేసుకున్నారు. ఈ విషాద ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్( Kushaiguda Police ) పరిధిలోని కందిగూడలో చోటు చేసుకుంది.
తార్నాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సతీష్, వేద అనే ఇద్దరు దంపతులు నివాసముంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఈ దంపతులకు నిషికేత్(9), నిహాల్(5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరు పిల్లల అనారోగ్య సమస్యలతో( Health Problems ) బాధపడుతున్నారు.
నడి రోడ్డుపై అల్లుడిని నరికి చంపిన మామ, తమిళనాడులో పట్టపగలు ఘోరం..
పిల్లల బాధలను కళ్లారా చూడలేక దంపతులు ఎప్పుడూ ఆవేదన చెందేవారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పిల్లలకు ముందుగా పొటాషియం సైనేడ్( potassium cyanide ) ఇచ్చి, ఆ తర్వాత దంపతులిద్దరూ కూడా అదే సైనేడ్‌ను తీసుకున్నారు. దీంతో నలుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రి( Gandhi Hospital ) మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.