Green Metro Luxury: 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతామని తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌లు ఈ బస్సులను ప్రారంభించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నేడు ప్రారంభం అయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌లు ఈ బస్సులను ప్రారంభించారు. వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జేబీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఈ బస్సులు నడవనున్నాయి. సీసీ కెమెరాలు, ప్రయాణికులకు ఛార్జింగ్ సదుపాయం వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా సౌకర్యాలను అందించాలి. ఎంత కష్టాల్లో టీఎస్ఆర్టీసీ ఉన్నా ప్రయాణికుల సంక్షేమమే మాకు ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్ లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నాం. వచ్చే కొన్ని ఏసీ లేని బస్సులు వస్తున్నాయి. వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలనుకుంటున్నాం. మెట్రో వీటిన్నింటిని అనుసంధానం చేయాలి.' అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.
నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన గంజాయి కేసు నిందితుడు, వీడియో ఇదిగో..
కొత్త 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుంది. ఎయిర్ పోర్టుకు గతంలో నడిచేవి. అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. ఐటీ కారిడార్ తో పాటు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.' అని ఆర్టీసి ఎండీ సజ్జనార్ అన్నారు.