Harishrao Slams CM Revanth Reddy: 'స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు'..రేవంత్‌పై హరీశ్‌ ఫైర్, మాట తప్పిన సీఎం ఆలయాలను శుద్దిచేయాలని కామెంట్, రుణమాఫీ చేసే వరకు వదలిపెట్టమని వార్నింగ్

ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తుండగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ఆలేరులో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు హరీశ్ రావు.

Harish Rao Visits Yadadri Narasimha Swamy Temple, slams CM Revanth Reddy(X)

Yadadri, Aug 22:  ప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేసిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తుండగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ఆలేరులో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు హరీశ్ రావు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌.. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశానని తెలిపారు. సీఎం రేవంత్‌ మాట ఇచ్చి తప్పినందుకు పరిహార పూజలు చేశామని చెప్పారు. స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు.. తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని అని వేడుకున్నానని తెలిపారు.

ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారు అన్నారు. మాట తప్పిన సీఎం ఆలయాలను శుద్దిచేయాలని విమర్శించారు. రుణమాఫీ చేసే వరకు రేవంత్ రెడ్డి వదిలిపెట్టమని హెచ్చరించిన ఆయన...ప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేసిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ అని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలుపుకోసం అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై బీఆర్ఎస్ పోరు, యాదాద్రి నుండి హరీశ్ రావు ఆలయాల యాత్ర, 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు

Here's Video:

 రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరోవైపు మంత్రులు కాలేదు అంటున్నారు అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, మిగిలిన 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 17 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని అంటున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మలది మరో మాట ఉందన్నారు. ఏది నమ్మాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రుణమాఫీపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఎక్కడైనా సిద్ధమేనని తెలిపారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్‌, మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, బూడిద బిక్షమయ్య తదితరులు ఉన్నారు.



సంబంధిత వార్తలు