Hijra Love Marriage With A Man: హిజ్రాను ప్రేమించి, సహజీవనం చేసి, పెద్దలను ఒప్పించి పెళ్లాడిన యువకుడు, భద్రాద్రి కొత్తగూడెంలో వింత ఘటన
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది.
ఇల్లెందు, మార్చి 12: హిజ్రాను ప్రేమించి, ఆమెతో సహజీవనం చేసి, పెద్దలను ఒప్పించి పెళ్లాడాడో యువకుడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది. భూపాలపల్లికి చెందిన రూపేశ్ కు ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
కొన్నాళ్లకు వారి స్నేహం ప్రేమగా మారింది. ఒకరికి వదిలి ఒకరు ఉండలేనంత గాఢ ప్రేమలో మునిగిపోయారు. ఇల్లెందులోని స్టేషన్ బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. ఎన్నాళ్లని ఇలా తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా ఉండాలి ? అని భావించిన రూపేశ్ తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. వారు కూడా అంగీకరించడంతో రూపేశ్-అఖిల ల వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది.
Tags
Hijra
hijra love
hijra love marriage
hijra love marriage in khammam
hijra love marriage with a man
hijra love marriage with a man in bhubaneswar
hijra love marriage with a man in karnataka
hijra love marriage with a man in vishaka
hijra love marriages
hijra love story
hijra marriage
hijra marriage in temple
hijra marriage proposal
hijra marriage video
hijra marriage with a man
hijra marriage with man
hijra marriages
hijras marriage
marriage