Hyderabad Drug Case: హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాపై సంచలన విషయాలు, డ్రగ్స్‌ ఇంటర్నేషనల్‌ పెడ్లర్‌ టోనీ నుండి కీలక విషయాలు తెలుసుకున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం

నగరంలోని పలు చోట్ల ఎక్సైజ్, పోలీసులు ( Hyderabad Police) ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మల్లెపల్లి అత్తాపూర్, గోపనపల్లిలో దాడులు జరిగాయి. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.

Drugs. Image Used For Representational Purpose Only. (Photo Credits: Pixabay)

Hyd, Jan 31: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రగ్స్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలోని పలు చోట్ల ఎక్సైజ్, పోలీసులు ( Hyderabad Police) ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మల్లెపల్లి అత్తాపూర్, గోపనపల్లిలో దాడులు జరిగాయి. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా విక్రయిస్తున్న నైట్రోవేట్ ట్యాబ్లెట్స్‌ను సీజ్ చేశారు. దాదాపు 286 మాదక ద్రవ్యం ట్యాబ్ లెట్స్‌ను గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు కన్యాకుమారి, రాజ్ కుమారిలను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నగరంలో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్‌ కేసులో (Hyderabad Drug Case) ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ ఇంతకాలం పోలీసులకు కళ్లుగప్పి తప్పించుకుని తిరిగాడు. కానీ అతన్ని చివరకు ముంబైలో పట్టుకున్నారు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఈ క్రమంలోనే అతని బ్యాగ్రౌండ్‌ ఏమిటా అనేది ఆసక్తికరంగా మారింది. టోనీ (Drug peddler Tony) పూర్తి పేరు చుకువు డేవిడ్ అలియాస్ మార్ష్‌ టోనీ. తండ్రి పేరు అభియా మార్ష టోనీ..తల్లి పేరు రోజ్ మేరీ చుకువు. బర్త్ ప్లేస్ షాగాము విలేజ్, నైజీరియా. అనంతరం నైజీరియాలోని ఒక్ పంక్ విలేజ్‌కి మకాం మార్చాడు..

2013 నుండి బట్టల వ్యాపారం ముసుగులో ముంబైలో డ్రగ్స్ దందాకు తెర లేపిన టోనీ. ముంబైలోని అంధేరీ ఈస్ట్, చాందీవాలీలలో మిలాన్ కాంప్లెక్స్ లో టోనీ నివసిస్తూ.. ముంబై నుండి షిప్స్‌ ద్వారా డ్రగ్స్‌ను భారత్‌కు దిగుమతి చేసేవాడు.. అలా డ్రగ్స్‌ పెడ్లర్‌గా, డ్రగ్స్‌ డాన్‌గా ఎదిగాడు. వీసా గడువు ముగిసిన కూడా అక్రమంగా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ బిజినెస్ కొనసాగిస్తున్న టోనీ.. గత 9 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ముంబై లో టోని కోసం భారీగా ఇన్ఫార్మర్లను పోలీసులు ఏర్పాటు చేయగా, చివరకు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతన్ని ముంబైలో అరెస్ట్‌ చేశారు.

రూ.5 వేల కరోనా ఇంజెక్షన్ రూ.30 వేలకు, హైదరాబాద్‌లో పట్టుబడిన ముఠా, ఏడుమంది అరెస్ట్, వివరాలను వెల్లడించిన కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు

టోనీ దగ్గర నుంచి 2 సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అయితే సెల్‌ఫోన్‌లో డేటా మొత్తాన్ని డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్, ఫేస్‌టైమ్ డేటాను ఎప్పటికప్పుడు టోని డిలీట్ చేశాడు. వాట్సాప్ చాటింగ్‌లు (Police finds WhatsApp contacts) కూడా ప్రతిరోజు డిలీట్ చేసినట్లుగా గుర్తించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ముందుస్తుగా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. దీంతో డేటా అనాలసిస్ కోసం ఫోరెన్సిక్‌ పంపించారు పోలీసులు. ఈ క్రమంలో టోనీ కాంటాక్ట్స్ లిస్టును పోలీసులు రిట్రీవ్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో టోనీ టచ్‌లో ఉన్నట్లుగా విచారణలో గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వ్యాపారవేత్తల చిట్టాతో విచారణ చేపడుతున్నారు. టోనీ, వ్యాపారవేత్తల మధ్య ఉన్నసంబంధాలు గురించి టాస్క్‌ఫోర్స్‌ ఆరా తీస్తుంది.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో పంజాగుట్ట పోలీసులు ప్రశ్నిస్తున్న చుక్వు ఒగ్బోన్నా డేవిడ్ అలియాస్ టోనీ తన ఖాతాదారులకు కొకైన్ సరఫరా చేయడానికి మహిళలతో సహా కొరియర్‌ల నెట్‌వర్క్‌ను ఉపయోగించాడు. ముంబైకి చెందిన ఓ మహిళ టోనీకి కొన్ని సందర్భాల్లో ఏజెంట్‌గా పనిచేసి కస్టమర్లకు డ్రగ్‌ను సరఫరా చేసింది. టోనీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ మరియు కాల్ వివరాలను తనిఖీ చేసిన పోలీసులు అతను తన ఏజెంట్లతో కమ్యూనికేట్ చేయడానికి నైజీరియన్ సిమ్ కార్డ్‌తో సహా రెండు మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నారు, వారు కస్టమర్లతో వ్యవహరించారు.

ఎయిర్‌పోర్టుల్లో భద్రతా తనిఖీల్లో పట్టుబడతామనే భయంతో ఏజెంట్లు ప్రైవేట్ కార్లు లేదా బస్సుల్లో ప్రయాణించారు. “విమానాశ్రయాలలో భద్రతా స్థాయిలు ఎక్కువగా ఉన్నందున, ఏజెంట్లు ప్రైవేట్ కార్లు లేదా బస్సులలో నగరానికి డ్రగ్‌ను తీసుకురావడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే, వారు దానిని కొరియర్ ద్వారా పంపేవారు, ”అని దర్యాప్తును పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారి తెలిపారు.

డ్రగ్స్‌ ఇంటర్నేషనల్‌ పెడ్లర్‌ డేవిడ్‌ అలియాస్‌ టోనీ మూడవ రోజు విచారణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు రోజులపాటు విచారించిన పోలీసులు.. రెండు రోజుల విచారణలో రాబట్టిన వివరాలు ఆధారంగా.. ఇవాళ విచారణను కొనసాగించనున్నారు. మొదటి రోజు 5గంటల పాటు సాగిన విచారణ, రెండో రోజు 4గంటల పాటు జరిగింది. టోనీని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో విచారించిన పోలీసులు.. అతను వాడిన 10 బ్యాంక్‌ అకౌంట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్థిక ఇబ్బందులతోనే డ్రగ్స్‌ బిజినెస్‌లోకి వచ్చానన్న టోనీ.. నైజీరియాకు చెందిన వ్యక్తి చెప్పడంతోనే ఇండియాకు వచ్చానన్నాడు. ఇండియాకు వచ్చిన తర్వాత టోనీ.. హైదరాబాద్‌కు ఎన్నిసార్లు వచ్చాడు.. ఎక్కడెక్కడ షెల్టర్‌ పొందాడు.. బ్యాంక్‌ లావాదేవీలపై.. పోలీసులు లోతుగా విచారించారు.