HYD CP Anjani Kumar: కేసు నమోదు చేయని పోలీసులపై హైదరాబాద్ కమిషనర్ ఆగ్రహం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెన్సన్ వేటు, బీకేర్‌పుల్ అంటున్న సీపీ అంజనీ కుమార్

నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడరు.

Five cops face music for not registering case (PHOTO-TWITTER)

Hyderabad,October 8:  హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ డ్యూటీలో స్ట్రిక్ అని అందరికీ తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడరు. పోలీసులు ప్రజలకు జవాబుదారీ తనంతో ఉండాలని చెబుతుంటారు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటారా.. కేసు రిజిస్టర్ చేసుకోమన్న బాధితులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు మరి.

విషయం ఏంటంటే... ప్రియాంక అనే మహిళ కారులో బంజారా హిల్స్ రోడ్ నెం.12నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కారు రోడ్ డివైడర్ ను ఢీకొట్టింది. కాగా రోడ్ మీద వెళ్తున్న వారు పోలీసులు రాకముందే వారిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాతి రోజు బాధిత కుటుంబాల్లోని వ్యక్తులు కేసు ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదట.

కేసు రిజిష్టర్ చేసుకోండి బాబూ అని నాలుగు పోలీస్ స్టేషన్లకు తిరిగినా ఒక్కరూ పట్టించుకోలేదని బాధితులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌తో మొరపెట్టుకున్నారు. దీంతో ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు అన్ని తిప్పలు పెట్టడం పట్ల హైదరాబాద్ సిటీ కమిషనర్ అజంనీకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బంజారా హిల్స్, హుమాయున్ నగర్‌ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను, పంజాగుట్ట, బంజారాహిల్స్‌లలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను ట్రాన్సఫర్ చేశారు. జవాబుదారితనంతో ఉండాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

సెప్టెంబర్ 29న మసబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద తన హోండా సిటీ కారు డివైడర్ ని ఢీకొట్టింది. డ్రైవర్ షీబుతో పాటు కారులో ఉన్న ఇద్దరు మహిళలకు కొద్దిపాటి గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేయడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్తే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని, అక్కడకు వెళ్తే హుమాయున్ నగర్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు. చివరికి పది గంటలపాటు తిరిగిన తర్వాత సైఫాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఈ విషయాన్ని బాధితులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు చెప్పడంతో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఆయన చర్యలు తీసుకున్నారు.