Ganesha Idol Immersion: గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే, స్పష్టం చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ప్రతి మండపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని వినతి

ఈ నేపథ్యంలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి (Ganesh Utsav Samithi) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్‌ భగవంత్ రావు వెల్లడించారు.

Ganesha Idol Immersion (Photo-Twitter)

Hyd, July 22: భాగ్య నగరంలో వినాయకుని ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి (Ganesh Utsav Samithi) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్‌ భగవంత్ రావు వెల్లడించారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును (Telangana High Court order) స్వాగతీస్తున్నామని తెలిపారు. విగ్రహాల ఎత్తు విషయంలో ( height of Ganesh idols) ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.

యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నిమజ్జనం ఏర్పాట్లను ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని కోరారు. మండప నిర్వహకులు ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

హైదరాబాద్‌లో ఇదేమి వాన, రోడ్ల మీద నీరు నిలిచిన వీడియోలు చూస్తే వామ్మో అనాల్సిందే

ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి మండపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే వేడుకలను సంస్కృతి సాంప్రదాయబద్దంగా నిర్వహించాలని, డీజే, సినిమా పాటలు, డాన్సులు లేకుండా ఉత్సవాలు జరపాలని పేర్కొన్నారు.