Minister Srinivas Goud: హత్య చేసేందుకు రూ.12కోట్ల సుపారీ, తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్రను చేధించిన పోలీసులు, నలుగురు అరెస్ట్
మంత్రితో ( Telangana Minister Srinivas Goud) పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్‌కు సుపారీ గ్యాంగ్‌తో హత్యకు మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు కుట్ర పన్నారు.
Hyd, Mar 2: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మంత్రితో ( Telangana Minister Srinivas Goud) పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్‌కు సుపారీ గ్యాంగ్‌తో హత్యకు మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు కుట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తికి రూ.12కోట్ల సుపారీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఫరూక్ షేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి యాదయ్య, విశ్వనాథ్, నాగరాజును అరెస్టు చేశారు. నిందుతుల్లో ఒకడైన నాగరాజు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలో బీజేపీ నేత జితేందర్‌రెడ్డి నివాసంలో రఘు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రఘుకు ఆశ్రయం ఇచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించి వదిలేశారు. హత్య కుట్ర కోణాన్ని ఢిల్లీ పోలీసులకు సైబరాబాద్ పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి మరికొద్ది సేపట్లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్‌మీట్ నిర్వహించి, అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు.
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఎన్నికల అఫిడవిట్‌పై (election affidavit) వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి ఇటీవల స్పందించారు. తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆమోదించిన తుది అఫిడవిట్‌నే పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. నామినేషన్లు వేశాక అఫిడవిట్ మార్చడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల టైమ్ నుంచే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
అసలు వాస్తవాలు తెలుసుకోకుండా ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని అన్నారు. Delhi High Coutలో 2021 డిసెంబర్‌లో కేసు డిస్మిస్ అయిందని అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో ఆరా తీస్తామన్నారు. ఇతరులు వేసిన పిటిషన్ లు తెలంగాణ హైకోర్టు లో విచారణలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.