Hyderabad: మాయమాటలతో పొదల్లోకి తీసుకువెళ్లి బాలికపై దారుణంగా అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు, నల్గొండ జిల్లాలో భూమి తన పేర రాయలేదని భార్య మరో దారుణం

పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోటార్‌ సైకిల్‌పై హిమాయత్‌సాగర్‌ వైపు తీసుకెళ్లాడు.

Representational Image (Photo Credits: File Image)

Hyd, Dec 31: భాగ్య నగరంలోని రాజేంద్రనగర్‌లో దారుణం​ జరిగింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోటార్‌ సైకిల్‌పై హిమాయత్‌సాగర్‌ వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి (Juvenile held for rape of minor girl) ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.

అత్యాచారం అనంతరం తిరిగి బాధిత యువతిని నిందితుడు ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. అయితే నాలుగు అయిదు రోజుల పాటు యువతి తనపై జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు. ఎట్టకేలకు తనపై జరిగిన అత్యాచార ఘటన గూర్చి ఇంట్లో ఉన్న తల్లితో బాధితురాలు చెప్పుకుంది. దీంతో వెంటనే తల్లి, బాధితురాలుతో కలిసి రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో (Rajendranagar Police Station) ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకునిపై అత్యాచార కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇక మరో దారుణ ఘటనలో నాలుగు ఎకరాల భూమిని తన పేరిట పట్టా చేయడం లేదని ఓ వివాహిత (Married woman)) దారుణానికి తెగబడింది. మద్యంలో పురుగుల మందు కలిపి భర్తను మట్టుబెట్టింది. ఈ ఘటన దేవరకొండ మండలం శేరిపల్లి పెద్దతండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. సీఐ బీసన్న, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్‌ మోతీలాల్‌(45) భార్య లలితతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. దంపతుల (Couples) మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటుండడంతో లలిత ఆరేళ్లుగా పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని గుర్రంగూడలో నివాసం ఉంటోంది. అక్కడే కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటుండగా మోతీలాల్‌ స్వగ్రామంలోనే వ్యవసాయం, కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు.

కామాంధుడికి యావజ్జీవ శిక్ష, కోపంతో జడ్జిపై చెప్పులు విసిరేసిన దోషి, ఒక్కసారిగా షాక్ తిన్న న్యాయమూర్తి, హజిరా బాలిక హత్యాచారం కేసులో నిందితుడు సుజిత్‌ సాకేత్‌ జీవితాంతం జైల్లోనే మగ్గాలంటూ తీర్పు

కాగా, మోతీలాల్‌ పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని తన పేరిట చేయాలని కొంతకాలంగా లలిత కోరుతోంది. ఇదే విషయం ఇద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. కాగా బుధవారం స్వగ్రామమైన శేరిపల్లి పెద్ద తండాలో బంధువులు శుభకార్యానికి లలిత హైదరాబాద్‌ నుంచి వచ్చింది. రాత్రి సమయంలో ఇదే అదునుగా భావించిన లలిత మద్యంలో పురుగుల మందు కలిపి భర్తకు తాగించింది. దీంతో మోతీలాల్‌ మృతిచెందాడు. కాగా, గురువారం తెల్లవారుజామున లలిత బోరున విలపిస్తుండడంతో ఇరుగుపొరుగు వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీయగా అతిగా మద్యం తాగి తన భర్త మోతీలాల్‌ మృతిచెందాడని తెలిపింది. లలిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు నిలదీయడంతో మద్యంలో పురుగుల మందు కలిపి హత్య చేసినట్లు నేరం అంగీకరించింది.

సమాచారం మేరకు సీఐ బీసన్న ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడు శివరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బీసన్న పేర్కొన్నారు. కాగా, నేరం అంగీకరించిన నిందితురాలు లలితను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.



సంబంధిత వార్తలు