Hyderabad Metro Student Pass: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్, విద్యార్ధులకు పాస్ అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ మెట్రో రైల్, పాస్ ఎలా తీసుకోవాలంటే?
వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు పునః ప్రారంభంకావడంతో విద్యార్థుల కోసం కొత్తగా స్టూడెంట్ పాస్‌ను (Metro pass) అందుబాటులోకి తీసుకొచ్చింది.
Hyderabad, July 01: విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు పునః ప్రారంభంకావడంతో విద్యార్థుల కోసం కొత్తగా స్టూడెంట్ పాస్‌ను (Metro pass) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాస్ సహాయంతో విద్యార్థులు కేవలం 20 ట్రిప్పుల ఛార్జితోనే 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ స్టూడెంట్ పాస్ స్మార్ట్ కార్డు (Student pass) రూపంలోనే అందుబాటులో ఉండనుంది. ఈ పాస్ సహాయంతో నెల రోజుల్లో 30 రైడ్‌లు చుట్టేయవచ్చు. ఈ పాస్‌ను 9 నెలల వ్యాలిడిటీతో ఇవ్వనున్నారు. అంటే ఈ ఏడాది జూలై 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు ఈ పాస్ అందుబాటులో ఉండనుంది.
ఈ మేరకు వివరాలను హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ట్విట్టర్‌లో వెల్లడించింది. జేఎన్‌టీయూ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, విక్టోరియా మెమోరియల్, దిల్‌సుఖ్ నగర్ స్టేషన్లలో కాలేజీ ఐడీ కార్డు చూపించి ఈ మెట్రో పాస్‌ను పొందవచ్చు.