Hyderabad: వీడియో, పాతబస్తీలో యువకులు ర్యాష్ డ్రైవింగ్,గన్ చూపించి వారికి చుక్కలు చూపించిన మీర్‌చౌక్ ఎస్సై, కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించిన యువకులు
విధి నిర్వహణలో మీర్‌చౌక్ ఎస్సై దీన్ని గమనించి వెంటనే తన పౌచ్‌లో ఉన్న గన్‌ను చేతిలోకి తీసుకుని కారు కిందకు దిగండి అంటూ బిగ్గరగా ఆరిచాడు.
పాతబస్తీలోని మీర్‌చౌక్ ఏసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున పాతబస్తీ ఎతేబార్‌చౌక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు ఓపెన్ టాప్ కారులో ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. విధి నిర్వహణలో మీర్‌చౌక్ ఎస్సై దీన్ని గమనించి వెంటనే తన పౌచ్‌లో ఉన్న గన్‌ను చేతిలోకి తీసుకుని కారు కిందకు దిగండి అంటూ బిగ్గరగా ఆరిచాడు.
దీంతో ఎస్సై చేతిలో గన్‌ను చూసిన కారులోని యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఎస్సై ఆవేశంతో ఆగ్రహంగా గన్‌తో యువకుల వద్దకు చేరుకోవడాన్ని చూసిన వాహనదారులు కొద్దిసేపు నిర్ఘాంత పోయారు. దీంతో సదరు యువకులు కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించారు.
డిక్కీతో పాటు వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ శబ్ధ కాలుష్యానికి పాల్పడిన వాహన యజమానికి మీర్‌చౌక్ పోలీసులు ఫైన్ విధించి పంపించారు.
Here's Video
దీనిపై దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య స్పందిస్తూ..అర్ధరాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించేటప్పుడు చేతిలో వెపన్‌లతో సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ఎస్సై స్థాయి అధికారి వాహనాల తనిఖీల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ వెపన్ చేతిలోనే ఉంటుందన్నారు.