Hyderabad Rename Row: హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, భాగ్యనగర్‌గా మారుస్తామని..దీనిని ఎవరూ అడ్డుకోలేరన్న బీజేపీ నేత
హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చి తీరతామని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు (BJP leader P Muralidhar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hyderabad, Mar 8: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటే ప్రపంచపటంలో ఓ ఐకాన్..అయితే అది ఇప్పుడు పేరు మార్చుకుని (Hyderabad Rename Row) కొత్త పేరుతో మన ముందుకు రానుందా..అంటే అవుననే అంటున్నారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చి తీరతామని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు (BJP leader P Muralidhar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ‘భారత్ నీతి’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘డిజిటల్ హిందూ కాంక్లేవ్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ పేరు మార్చే విషయంలో తమను ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. కేవలం పేరు మార్పే తమ ఉద్దేశం కాదని... సైద్ధాంతిక మార్పు కూడా తమ ఉద్దేశమన్నారు.
దీనిపై ప్రజల్లో కూడా మద్దతు కూడగడతామన్నారు. అవగాహన కలిగిస్తామని సమావేశంలో తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని మేధావులు అభిప్రాయ పడుతున్నారని, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయడం పై దేశంలోని చాలా మంది ప్రజలు మరియు మేధావులు అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి భారతదేశం మాత్రమే నమూనా కాబట్టి ఈ దేశ ప్రజలు వాటిని తిప్పి కొట్టి దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతంగా ఉందని నిరూపించారని ఆయన అన్నారు. ఇదివరకే హైదరాబాద్ పేరు మారుస్తామని బీజేపీ నేతలు ప్రకటించిన విషయం విదితమే.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అలహాబాద్ తరహాలోనే హైదరాబాద్ పేరు కూడా మారుస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్ ఇదివరకే వెల్లడించారు తమ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందని, ఇలాంటి పేర్లను మార్చడం తమ రెండో లక్ష్యమని వెల్లడించారు.
ఒకప్పుడు భాగ్యనగరంగా పేరొందిన నగరానికి 16వ శతాబ్దంలోని కుతుబ్ షాహీ హైదరాబాద్‌గా పేరు మార్చారని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మంది హిందువులపై దాడులు చేశారని, ఆలయాలను ధ్వంసం చేశారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని తిరిగి భాగ్యనగరంగా మార్చుతామని తెలిపారు.
హైదరాబాద్ పేరు మాత్రమే కాకుండా అప్పట్లో నగరం, తెలంగాణలోని ఇతర ప్రాంతాల పేర్లను కూడా మార్చారని రాజ సింగ్ తెలిపారు. సికింద్రాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల పేర్లను కూడా మార్చారన్నారు. అలాంటి ప్రాంతాలకు దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన ప్రముఖుల పేర్లు పెడతామని వెల్లడించారు.