Hyderabad Shocker: హైదరాబాద్ లో గంజాయి కలకలం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వద్ద 1.8 కిలోల గంజాయి స్వాధీనం..అరెస్టు చేసిన బాలానగర్ ఎస్వోటీ పోలీసులు..
అతని వద్ద రూ. 1.8 కిలోల అక్రమ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో గంజాయి రవాణా చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు బాలానగర్ లో అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 1.8 కిలోల అక్రమ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యాపుగంటి ఫణి కిరణ్ అనే వ్యక్తి నెట్‌వర్క్ ఇంజనీర్‌గా సినర్జిస్టిక్ సొల్యూషన్స్‌లో పనిచేస్తున్నాడు ఖాన్‌మెట్‌లోని శ్రీకర హాస్పిటల్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఆరు నెలలుగా నివసిస్తున్నాడు. ఆయన స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్‌లోని రావులపాలెం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్‌కు చెందిన నాగు అనే గంజాయి సరఫరాదారు ఫణికిరణ్‌కు గంజాయిని సరఫరా చేసేవాడు, ఆ తర్వాత డ్రగ్స్‌కు బానిసైన వినియోగదారులకు చిన్న ప్యాకెట్లలో పంపిణీ చేసేవాడు.