Hyderabad Shocker: మియాపూర్‌లోని అపార్ట్‌మెంటులో ఫ్యామిలీ ముసుగులో వ్యభిచారం, గుట్టురట్టు చేసిన పోలీసులు, అదుపులో నిర్వాహకులు
ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై మియాపూర్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్, మే 14: హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ఓ బహుళ అంతస్తుభవనంలోన ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తూ వచ్చిన వ్యభిచార దందాను పోలీసులు బహిర్గతం చేశారు. ఆ సమయంలో వ్యభిచారం రొంపిలో ఉన్న అమ్మాయిలతో పాటు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై మియాపూర్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ లింగానాయక్ తెలిపిన మేరకు.. మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో దాడి చేశారు.
ఒంగోలుకు చెందిన నిర్వాహకులు షేక్ ఇర్ఫాన్ (22), సాయిగణేష్‌రెడ్డి (27), మహిళను అదుపులోకి తీసుకున్నారు. దీంతో షేక్ ఇర్ఫాన్, గణేష్‌రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరివద్ద నుంచి ఐదు ఫోన్లు, రూ.3 వేల నగదు, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు.