Hyderabad Shocker: ఇద్దరితో రహస్యంగా అక్రమసంబంధం, మొదటి వ్యక్తికి తెలియడంతో రెండో ప్రియుడితో కలిసి అతన్ని దారుణంగా హత్య చేసిన మహిళ, కేసు వివరాలను వెల్లడించిన మహేశ్వరం ఏసీపీ సి.అంజయ్య

పది రోజుల క్రితం వ్యక్తిని దారుణంగా హతమార్చి డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనను పహాడీషరీఫ్‌ పోలీసులు చేధించారు.రెండో ప్రియుడి మోజులో పడిన మహిళ అతనితో కలిసి మొదటి ప్రియుడిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Hyd, June 7: పది రోజుల క్రితం వ్యక్తిని దారుణంగా హతమార్చి డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనను పహాడీషరీఫ్‌ పోలీసులు చేధించారు.రెండో ప్రియుడి మోజులో పడిన మహిళ అతనితో కలిసి మొదటి ప్రియుడిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్వరం ఏసీపీ సి.అంజయ్య, ఇన్‌స్పెక్టర్‌ ఎం.కాశీ విశ్వనాథ్‌తో కలిసి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పూరన్‌సింగ్‌ అలియాస్‌ దీపక్‌(30)కి వివాహానికి ముందే బంధువైన జయాదేవితో ప్రేమాయణం కొనసాగింది. వివాహానంతరం భార్య మమతతో కలిసి పూరన్‌సింగ్‌ చాంద్రాయణగుట్ట బండ్లగూడకు వలస వచ్చాడు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో జయాదేవి తన భర్త, పిల్లలను వదిలేసి కాటేదాన్‌కు వచ్చింది.

పాల ప్యాకెట్ కోసం వెళ్లిన మహిళా న్యాయవాదిని దారుణంగా కాల్చి చంపిన దుండగులు, భర్తే హత్య చేయించాడని అనుమానాలు

పూరన్‌సింగ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలోనే ఇంటికి సమీపంలోనే ఉంటున్న హర్యానాకు చెందిన నజీం(31) అనే వ్యక్తితో కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అయితే పూరన్‌కు అనుమానం వచ్చిందని గ్రహించిన వారు ఎలాగైనా అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జయాదేవి, నజీం కామన్‌ ఫ్రెండ్‌గా ఉన్న రాజేంద్రనగర్‌లో నివసించే తమిళనాడుకు చెందిన సుగుణా రాము(42)తో ఈ నెల 22న రాత్రి పూరన్‌సింగ్‌కు ఫోన్‌ చేయించి బాకీగా ఉన్న రూ.10 వేలు ఇస్తానంటూ తుక్కుగూడకు పిలిపించారు.

డబ్బులు వస్తాయనే ఆశతో వెళ్లిన పూరన్‌సింగ్‌ను నజీం, అతని స్నేహితుడు మబీన్‌, జయాదేవి, అసద్‌తో కలి సి దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి జేసీబీ ముందుండే పారలో వేసుకొని సమీపంలోని సూరం చెరువులో పడేసి పరారయ్యారు. పోలీసులు నజీం, సుగుణా రామును అరెస్ట్‌ చేయగా..మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement