Hyderabad Shocker: మియాపూర్‌లో మరో దారుణం, మాట్లాడటం లేదని ప్రియురాలిని కత్తితో పొడిచిన యువకుడు, అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం
అడ్డువచ్చిన ఆమె తల్లిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
Hyd, Dec 13: హైదరాబాద్ మియాపూర్‌లోని ఆదిత్య నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.తనను దూరం పెడుతుందనే కోపంతో ( refusing love ) ప్రేమికుడు ప్రియురాలిపై కత్తితో దాడి (youth assaulted a young woman) చేశాడు. అడ్డువచ్చిన ఆమె తల్లిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం ఆ యువకుడు తన గొంతు (cut his throat ) కోసుకున్నాడు. యువకుడు సందీప్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
తల్లీకూతుళ్లను కూడా సమీప ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని వైభవిగా, తల్లి శోభగా గుర్తించారు. వాళ్లను చికిత్స కోసం కొండాపూర్ కిమ్స్‌కు తరలించారు. మరోవైపు ప్రేమోన్మాది సందీప్ అలియాస్ బబ్లూను చికిత్స కోసం గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది. బబ్లూ స్వస్థం రేపల్లెగా గుర్తించారు.
రేపల్లెకు చెందిన సందీప్ కుమార్ అలియాస్ బబ్లూ, వైభవికి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే.. రెండేళ్ల నుండి బబ్లూని దూరం పెడుతూ వస్తోంది వైభవి. ఫోన్ నెంబర్ సైతం బ్లాక్ చేయడంతో.. వేరే నెంబర్లతో కాల్ చేసి తనతో మాట్లాడాలని వేధించసాగాడు బబ్లూ. మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లేదంటే చంపేస్తానంటూ బెదిరించాడు.
ఈ మే నెలలో రేపల్లె నుండి హైదరాబాద్ వచ్చి ఆదిత్య నగర్ లో తన తల్లి, సోదరుడితో ఉంటోంది వైభవి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన సందీప్.. నేరుగా వైభవి ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. ఆ ఆవేశంలోనే వైభవితోపాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అదే కత్తితో గొంతు కోసుకున్నాడు