Hyderabad Shocker: భార్యాభర్తలమంటూ కడప నుంచి హైదరాబాద్ వచ్చి లాడ్జిలో ఆత్మహత్య, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు

భార్యా భర్తలమని చెప్పి (claiming to be husband and wife) హోటల్‌ గదిలో దిగిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య (Two people committed suicide) చేసుకున్న సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Representational Image (Photo Credits: File Image)

Hyd, Mar 15: హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తలమని చెప్పి (claiming to be husband and wife) హోటల్‌ గదిలో దిగిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య (Two people committed suicide) చేసుకున్న సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గోసుల హేమంబదరెడ్డి (37), బి.ప్రసన్న లక్ష్మి(27) ఈ నెల 10న శుక్రవారం టెలిఫోన్‌ భవన్‌ రోడ్డులోని హోటల్‌ అలేఖ్యలో రెండో అంతస్తులో దిగారు.

అల్లుడు కాదు హంతకుడు, ఇంటికి వచ్చిన అత్తా మామలపై కత్తితో దాడి, అడ్డు వచ్చిన భార్యపై అటాక్, దాడిలో భార్య, అత్త మృతి, మామకు తీవ్ర గాయాలు

సోమవారం రాత్రి హోటల్‌ సిబ్బంది వారికి ఫోన్‌ చేసి చెక్‌ఔట్‌ చేస్తున్నారా.. ఉంటున్నారా అని ఆరా తీయగా కిందకు వస్తామని చెప్పారు. కానీ వారు ఎంతసేపటికీ రాకపోవడంతో మంగళవారం ఉదయం మరోసారి వారికి ఫోన్‌ చేశారు. వారు ఫోన్ లిఫ్ట్‌ చేయకపోవడంతో హోటల్‌ సిబ్బంది డూప్లికేట్‌ కీ సాయంతో గదిని ఓపెన్‌ చేసి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని హేమంబదరెడ్డి, బెడ్‌పై అచేతనంగా పడిన స్థితిలో ప్రసన్న లక్ష్మి కన్పించారు. వెంటనే లాడ్జి సిబ్బంది సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

హర్యానాలో దారుణం, పెళ్లి చేయలేదని తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన కొడుకు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

ఈ మేరకు ఇన్స్‌స్పెక్టర్‌ సత్తయ్య నేతృత్వంలో ఎస్‌ఐ సూరజ్‌ కేసు నమోదుచేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఆత్మహత్యకు కారణాలు, ప్రసన్న లక్ష్మిది కూడా ఆత్మహత్యేనా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరా పరిశీలించగా సోమవారం అర్థరాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రసన్న లక్ష్మి సూట్‌కేస్‌తో లిఫ్ట్‌ వరకు వచ్చి తిరిగి మరలా గదిలోకి వెళ్లినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.