Ranganath On N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, చట్టప్రకారమే కూల్చివేతలని కామెంట్,కేటీఆర్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ ఎంపీ
చెరువులు, కుంటలను ఆక్రమించిన వారిపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. ఇందులో భాగంగా ఇవాళ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. ఉదయం భారీ బందొబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ కొనసాగించగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధించింది న్యాయస్థానం.
Hyd, Aug 24: అక్రమ కట్టడాల కూల్చివేత తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారిపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. ఇందులో భాగంగా ఇవాళ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. ఉదయం భారీ బందొబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ కొనసాగించగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధించింది న్యాయస్థానం.
దీనిపై స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని....ఎన్ కన్వెన్షప్ పై ఎలాంటి స్టే లేదని స్పష్టం చేశారు. వ్యవస్థను తప్పుదారి పట్టించి వ్యాపార కార్యక్రమాలను నిర్వహించారని, ఫ్ టీఎల్, బఫర్ జోన్ లో అనుమతి లేని నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఎఫ్ టీఎల్ లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని రంగనాథ్ చెప్పారు.
ఇక హైడ్రా కూల్చివేతలపై స్పందించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగించాలని... పదేళ్లు రాష్ట్ర మున్పిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదని, ఆయనను మొదటి ముద్దాయిగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే, కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, నాగార్జునకు రిలీఫ్
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణకు కమిటీ వేశారు. కేటీఆర్ పొంగులేటి, పట్నం, వంటి నేతల పేర్లు చెబుతున్నారు. ముందు నీ జన్వాడా ఫాంహౌస్ జేసీబీతో కూల్చి వేయాలన్నారు. రాజ్‌భవన్ రోడ్‌లో నాలాలపై ఆసుపత్రి కట్టారు.. భారీ భవనాలను నిర్మించారు. హైడ్రాకు రాజకీయ దురుద్దేశం లేకపోతే చెరువుల బఫర్ జోన్‌ను గుర్తించి కాపాడాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.