Pawan Kalyan On Telangana State: తెలంగాణ అంటే నా గుండె కొట్టుకుంటుంది...పోరాటల గడ్డ, బండెనక బండి కట్టి నాకు ఇష్టమైన పాట, పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అని మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి నాకు ఇష్టమైన పాట అన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని...ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిందన్నారు. పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు.

I AM Proud To Say About Telangana State says AP Deputy CM Pawan Kalyan(X)

Maharashtra, Nov 17: మీరందరూ చాలా మంది తెలంగాణ నుండి వచ్చారు..మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో..జై తెలంగాణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి నాకు ఇష్టమైన పాట అన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని...ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిందన్నారు. పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు.

మహారాష్ట్రలోని భోకర్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పవన్. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ముఖ్యంగా మహారాష్ట్ర రైతులు, రైతు కూలీలకు చెందిన నేల. ఈ ప్రాంతంలో జొన్న, మినుము, పత్తి విరివిగా పండుతాయి... మహారాష్ర్టలో అడుగు పెట్టగానే హర హర మహాదేవ మంత్ర ఉచ్ఛరణతో మనసు పులకిస్తోంది. హిందూ ధర్మానికి పునాదులు వేసిన నేల ఇది అన్నారు.

గడచిన పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల మంది భారతీయలను పేదరికం నుంచి విముక్తి చేసింది. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ది చేకూరింది. ముద్ర యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూత ఇచ్చింది. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ నితిన్ గడ్కరీ గారు 11 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించారు. 2028 లోపు మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నారు. మహారాష్ట్రలో పవన్ ఎన్నికల ప్రచారం, మజ్లిస్ పార్టీపై పంచ్‌లు..శివసేన-జనసేన ధర్మం కోసమే పోరాడుతాయని వెల్లడి 

Here's Video:

భారత దేశాన్ని ఐదు లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలకపాత్ర పోషించబోతోందన్నారు. మహా వికాస్ అఘాడి ప్రజలను విభజించి, పాలించాలని చూస్తోంది. దాని మాయలో పడి బందీలుగా మారొద్దు. మహారాష్ట్ర అభివృద్ధిపథంలో పయనించాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి... అది కేవలం ఎన్డీఏ ద్వారా సాధ్యమవుతోంది. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలిగే సత్తా ఒక్క శ్రీ మోదీ గారిలోనే ఉంది. ఎక్కడ స్థిరతం ఉంటుందో అక్కడ సమర్థ పాలన ఉంటుందన్నారు.

తెలుగు, కన్నడ, మరాఠి, గుజరాతీ అనే భావనలు అధిగమించి... దేశం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. మనందరిలో భారతీయులం అనే భావన మాత్రమే ఉండాలన్నారు. దేశం ఎప్పుడు ఎవరిపైనా వివక్ష చూపలేదు. సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్స్ గా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లు ఉన్నారు. అబ్దుల్ కలాం గారిని గుండెల్లో పెట్టుకున్న దేశం మనది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదభావం మనకు ఏనాడు లేదు. సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ మన నినాదం. సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఇదే. ఇదే ఉదాహరణ పాకిస్థాన్ లో గానీ, బంగ్లాదేశ్ లో గానీ కనపడదు అన్నారు.

కులం, రిజర్వేషన్ల పేరుతో విభజించాలని చూస్తున్నారు. విడిపోయి బలహీనపడదామా? కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి అస్థిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా కలసి బంగారు భవిష్యత్తు నిర్మిద్దామా? విడిపోయి అరాచకతత్వానికి స్థానం కలిపిద్దామా? కలిసి అభివృద్ధి, సంక్షేమం వైపు పయనిద్దామా? మీ చేతుల్లోనే ఉంది. ఎన్డీఏ అభ్యర్ధులను అఖండ మెజార్టీతో గెలిపించి మహారాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: తెలంగాణలో మూడు కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి, వరంగల్ మానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన తెలంగాణ సీఎం

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Harishrao: వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

Eknath Shinde Resign: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!