Telangana Farm Loan Waiver: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, రైతులు రూ. 2 లక్షల పైన ఉన్న రుణం డబ్బులు కడితే వాళ్లవి మాఫీ చేస్తామని ప్రకటన
ఈ పథకం అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా ప్లాన్ రచించింది. అయినప్పటికీ అర్హత ఉండి కూడా కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా ప్లాన్ రచించింది. అయినప్పటికీ అర్హత ఉండి కూడా కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. తాజాగా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏం మాట్లాడుతూ..రుణమాఫీ రూ.18 వేల కోట్లు చేశాం.. మిగతా 12 వేల కోట్లు, 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్లవి. రైతులు 2 లక్షల పైన ఉన్న రుణం డబ్బులు కడితే వాళ్లవి మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు'..రేవంత్‌పై హరీశ్ ఫైర్, మాట తప్పిన సీఎం ఆలయాలను శుద్దిచేయాలని కామెంట్, రుణమాఫీ చేసే వరకు వదలిపెట్టమని వార్నింగ్
Here's Video