Karimnagar: ఆ ముగ్గురిని కలిపిన వినాయకుడు, ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు, ఆప్యాయ పలకరింపు..ప్రత్యేక పూజలు

ఎప్పుడు ఉప్పు - నిప్పులా ఉండే ఆ ముగ్గురు నేతలు కలిశారు. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలే కాదు వ్యక్తిగత విమర్శలు చేసుకునే నేతలంతా ఒక వేదికపై కలిశారు. ఇందుకు వినాయకచవితి వేదికైంది.

Karimnagar, Sep 8: కరీంనగర్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడు ఉప్పు - నిప్పులా ఉండే ఆ ముగ్గురు నేతలు కలిశారు. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలే కాదు వ్యక్తిగత విమర్శలు చేసుకునే నేతలంతా ఒక వేదికపై కలిశారు. ఇందుకు వినాయకచవితి వేదికైంది.

కరీంనగర్ పట్టణంలోని టవర్ సర్కిల్, ప్రకాశ్ గంజ్, శాస్త్రీ రోడ్ లో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.

వైశ్య కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకునేందుకు బండి సంజయ్ రాగా అదే సమయంలో మంత్రి పొన్నం వచ్చారు. ఇద్దరు కరచాలనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తుండగా గంగుల కమలాకర్ వచ్చారు.  కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్, ఎమ్మెల్యే - ఎంపీ కావాలంటే కోట్లు ఖర్చుపెట్టాల్సిందే, వీడియో వైరల్

దీంతో ఒకరినొకరు కరచాలనం చేసుకున్నారు. పాలిటిక్స్‌ను పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇది చూసిన వారంతా అశ్చర్యపోయారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని కామెంట్ చేశారు.