Father Proud Movement: ఇది క‌దా ఓ తండ్రికి కావాల్సింది! ట్రైయినీ క‌లెక్ట‌ర్ గా వ‌చ్చిన కూతురికి సెల్యూట్ చేసి స్వాగ‌తం ప‌లికిన ఐపీఎస్ తండ్రి

ఐఏఎస్‌ అధికారిణిగా పోలీస్‌ అకాడమీకి వచ్చిన కుమార్తెకు (IAS Daughter) ఆ పోలీస్‌ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్‌ తండ్రి (IPS Father) సెల్యూట్‌ చేశాడు.

Father Salutes Daughter (PIC@ X)

Hyderabad, June 15: ఐఏఎస్‌ అధికారిణిగా పోలీస్‌ అకాడమీకి వచ్చిన కుమార్తెకు (IAS Daughter) ఆ పోలీస్‌ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్‌ తండ్రి (IPS Father) సెల్యూట్‌ చేశాడు. హైదరాబాద్‌ చిల్కూరు ఏరియాలోగల ‘రాజ్‌బహదూర్‌ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీ (RBVRR TGPA)’ లో శనివారం మధ్యాహ్నం ఈ అత్యంత అరుదైన ఘటన జరిగింది. శనివారం ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులు ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ కోసం RBVRR TGPA కు వచ్చారు. వారికి పోలీస్‌ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్‌కు బదులుగా.. జాయింట్‌ డైరెక్టర్‌ డీ మురళీధర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ వేంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అనంతరం అకాడమీ మరో డిప్యూటీ డైరెక్టర్‌ సీ నర్మద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులకు బ్రీఫ్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

 

ఆ తర్వాత ఇంటరాక్టివ్‌ సెషన్‌ నిర్వహించారు. ఈ సెషన్‌లో ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులు తమ ట్రెయినింగ్‌ అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత ట్రెయినీ ఐఏఎస్‌లు పోలీస్‌ అకాడమీ క్యాంపస్‌ అంతటా కలియ తిరిగారు. ఈ సందర్భంగా అకాడమీలోని అధికారులు.. పోలీస్‌ ట్రెయినింగ్‌కు సంబంధించిన పలు అంశాలను క్షుణ్ణంగా వివరించారు.

అయితే పోలీస్‌ అకాడమీకి ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ కోసం వచ్చిన ఏడుగురు 2023 బ్యాచ్‌ ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారుల్లో ఉమా భారతి ఒకరు. ఆ ఏడుగురు ఐఏఎస్‌ అధికారులకు సెల్యూట్‌ చేసి స్వాగతం పలికిన వారిలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ వేంకటేశ్వర్లు ఉన్నారు. ఆయన ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి ఉమా భారతికి కన్నతండ్రి. ఐఏఎస్‌ అధికారిణిగా వచ్చిన బిడ్డకు ఐపీఎస్‌ తండ్రి సెల్యూట్‌ చేసిన ఈ ఘటన అకాడమీలో ఓ ప్రత్యేకతగా నిలిచింది. ప్రస్తుతం ఉమాభారతి వికారాబాద్‌ జిల్లాలో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif