Justice Ujjal Bhuyan Sworn: తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం, హాజరయిన సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు

ఆయనతో గవర్నర్ తమిళిసై(Governer Tamilsie) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న సతీశ్‌చంద్ర శర్మ.. ఢిల్లీకి బదిలీ అయ్యారు.

Justice Ujjal Bhuyan Sworn (Photo-Twitter)

తెలంగాణ హైకోర్టు(High Court) కొత్త సీజే‌(CJ)గా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై(Governer Tamilsie) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న సతీశ్‌చంద్ర శర్మ.. ఢిల్లీకి బదిలీ అయ్యారు. గత నాలుగేళ్లలో తెలంగాణ హైకోర్టుకు.. ఐదుగురు సీజేలు బాధ్యతలు చేపట్టినట్లు అయ్యింది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి, tsbie.cgg.gov.in లింక్ ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

ప్ర‌మాణ‌స్వీకారం కార్య‌క్ర‌మం అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన తేనేటి విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మిళిసైతో కేసీఆర్ ముచ్చ‌టించారు. ఇక అక్క‌డే ఉన్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఈ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్, సీఎం, కేంద్ర మంత్రి మ‌ధ్య న‌వ్వులు విరిశాయి.హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌మాణస్వీకార కార్య‌క్ర‌మానికి శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, నిరంజ‌న్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, రాజ్య‌స‌భ స‌భ్యులు సురేశ్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.