Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ శవం లభ్యమైంది. అర్థరాత్రి దాటిన తరువాత కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమైన విషయం తెలిసిందే.

Kamareddy..Three Including Woman Cop dies by Suicide(video grab)

Hyd, December 26:  కామారెడ్డిలో సంచలనం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ శవం లభ్యమైంది. అర్థరాత్రి దాటిన తరువాత కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమైన విషయం తెలిసిందే.

తాజాగా అదృశ్యమైన ఎస్సై మృతదేహం కూడా దొరికింది. కానిస్టేబుల్ శృతితో వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.  కామారెడ్డిలో మిస్టరీ హత్యలు?...చెరువులో కానిస్టేబుల్‌తో పాటు మరొకరి మృతి దేహం..ఘటనా స్థలంలో ఎస్సై పర్సనల్ కారు! 

కామారెడ్డి జిల్లా బీబీపేట్ ఎస్సైగా సాయి కుమార్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అదే పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శృతికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు సమాచారం. అప్పటికే ఎస్సైకి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉండగా.. అప్పటికే శృతికి పెళ్ళై విడాకులు అయినట్లు తెలుస్తోంది.

SI  dies by Suicide in Kamareddy

ఎస్సై బదిలీ పై బిక్కునూర్ రావడంతో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో శృతికి సన్నిహితం పెరిగింది.. ఈ విషయం తెలిసిన ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ముగ్గురు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Suicide Prevention and Mental Health Helpline Numbers:

Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.



సంబంధిత వార్తలు

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో