IPL Auction 2025 Live

Bandi Sanjay Biography: కార్పొరేట‌ర్ నుంచి కేంద్ర‌మంత్రి వ‌ర‌కు...బండి సంజ‌య్ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ ప్ర‌స్థాన‌మిదీ! ఇప్ప‌టి వ‌ర‌కు ఏయే ప‌ద‌వులు ద‌క్కాయంటే?

బీజేపీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు బండి ప్రస్థానం (Bandi Sanjay Biography) ప్రశంసనీయం. బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్‌లో ఆయన పనిచేశారు.

bandi Sanjay (Photo-Twitter)

Hyderabad, June 09: కేంద్ర కేబినెట్‌లో బీజేపీ తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌కి (Bandi Sanjay) చోటు దక్కనుంది. బీజేపీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు బండి ప్రస్థానం (Bandi Sanjay Biography) ప్రశంసనీయం. బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్‌లో ఆయన పనిచేశారు. కరీంనగర్ నగర పాలక సంస్థ గా ఏర్పడిన తర్వాత తొలి 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గా గెలిచారు. 2014, 2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. వాటిల్లో ఓడిపోయారు. ఎంపీగా.. 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు సార్లు విజయం సాధించారు. 2020లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమితుడయ్యారు. 2023లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2024 లో జాతీయ కిసాన్ మోర్చ ఇన్‌ఛార్జిగా ఆయనను బీజేపీ నియమించింది.

Modi Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి. ప్రధాని నివాసానికి వెళ్లిన బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి. 

బండి సంజయ్ వ్యక్తిగత ప్రొఫైల్:

పుట్టిన తేదీ:11-7-1971

తల్లిదండ్రులు: బండి నర్సయ్య - శకుంతల.

అక్క :శైలజ

అన్నలు : బండి శ్రవణ్ కుమార్, బండి సంపత్ కుమార్

భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని)

పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్

కులం: మున్నూరుకాపు,(బి.సి-'డి')

ప్రస్తుత బాధ్యతలు:

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు

గతంలో చేపట్టిన బాధ్యతలు:

బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా..

అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..

కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్‌గా..

బీజేపీ జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్‌గా భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. BJP రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జ్‌గా, కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు.

వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ నగర బీజేపీ అధ్యక్షునిగా

2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, టీఆర్‌ఎస్‌ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.

2019లో ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్‌గా నియామకం

2019లో అర్బన్ డెవలప్‌మెంట్‌ పార్లమెంట్ కమిటీ మెంబర్‌గా నియామకం

2019లో టొబాకో బోర్డు మెంబర్‌గా నియామకం.

2019లో మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్‌గా నియామకం

2020లో ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబర్‌గా నియామకం

2020లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం

2023లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం

2023 అసెంబ్లీ ఎన్నికల్లో 89000 ఓట్లు సాధించారు

2024లో జాతీయ కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా నియామకం

2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2 లక్షల 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపు



సంబంధిత వార్తలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

CM Atishi Comments on Amith Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై సీరియ‌స్ కామెంట్స్ చేసిన ఢిల్లీ సీఎం అతిషి, గ్యాంగ్ స్ట‌ర్ల‌కు అడ్డాగా మారింద‌ని ఆగ్ర‌హం

Telugu IAS Sanjay Murthy: ‘కాగ్’ చీఫ్ గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌ మూర్తి.. సంజయ్‌ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ