KTR On Congress: క‌రెంట్ బిల్లుల‌ను సోనియా గాంధీకే పంపిద్దాం! ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీఆర్ఎస్ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేదన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామన్నారు. పోయిన మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామన్నారు.

Minister KTR (Photo-X)

Hyderabad, JAN 21: 200 యూనిట్లలోపు విద్యుత్‌ బిల్లులు కట్టొద్దని.. ఆ బిల్లులు సోనియాగాంధీనే కడుతుందని కాంగ్రెస్‌ నేతలు చెప్పారని.. కరెంటు బిల్లులు ఆమెకే పంపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందన్నారు. బీఆర్ఎస్ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేదన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామన్నారు. పోయిన మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్‌ అన్నారు. కార్యకర్తలు కష్టపడి పని చేస్తే మల్కాజ్‌గిరిలో ఈ సారి విజయం మనదేనన్నారు.

KCR Walking Video: వీడియో ఇదిగో, ఊత కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్, తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి 

200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్, గత నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి పిలుపునిచ్చారని కేటీఆర్‌ గుర్తు చేశారు. వారి మాటలనే నేను గుర్తు చేశానన్నారు. నేను బిల్లులు కట్టొద్దంటే భట్టి నాది విధ్వంసకర మనస్తత్వం అని అంటున్నారని.. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా? అంటూ ప్రశ్నించారు. సోనియా గాంధీనే బిల్లులు కడుతుందని కాంగ్రెస్‌ వాలళ్లే చెప్పారని.. కరెంటు బిల్లులు సోనియాకే పంపుదామని పిలుపునిచ్చారు. సోనియాకు ప్రజలు బిల్లులు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలన్నారు. తప్పించుకునే కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తుందని.. మనం ఇప్పటి నుంచే ఒత్తిడి చేయాలన్నారు. నిరుద్యోగ భృతిపై భట్టి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పారని కేటీఆర్‌ విమర్శించారు. నిరుద్యోగ భృతి పై కాంగ్రెస్ తప్పించుకున్నట్టే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై మాట మార్చిందన్నారు.

Ayodhya Invitation for KCR: అయోధ్య రామాలయ వేడుకకు కేసీఆర్ ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. ఇప్పటికే చంద్రబాబు, పవన్ లకు ఆహ్వానం 

కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజాకోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్థంగా వాడుకోవాలన్నారు. మనం పాలన మీదే దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానెల్స్‌లో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయామన్నారు. ప్రగతి భవన్‌లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారని.. విలాసాలే అందులో ఉంటే భట్టి ఈ పాటికే టాంటాం చేయక పోయేవారా ? అంటూ ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డులు ఇచ్చాం.. ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదన్నారు. పార్టీ కమిటీలు కూడా పూర్తిగా వేయకపోవడంతో నష్టం జరిగిందని.. ఇక ముందు ఆలా జరుగదన్నారు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరుగవన్నారు.