Himanshu Song On KTR: కొడుకు పాడిన పాటను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్, ఈ సంవత్సరం అందిన ఉత్తమ బహుమతి అంటూ ప్రశంసలు

అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హిమాన్షు.. గత ఏడాది ఓ ఇంగ్లీష్‌ సాంగ్‌ (Golden Hour) ఆలపించి అందర్నీ మెప్పించాడు.

KTR-Himanshu (Credits: X)

Hyderabad, DEC 28: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మనుమడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) కుమారుడు హిమాన్షు (Himanshu) వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను ఇప్పటికే చాటుకున్నాడు. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హిమాన్షు.. గత ఏడాది ఓ ఇంగ్లీష్‌ సాంగ్‌ (Golden Hour) ఆలపించి అందర్నీ మెప్పించాడు. తాజాగా తన తండ్రి పట్ల తనకు ఉన్న ప్రేమ, అభిమానాలను చాటుతూ హిమాన్షు రావు ఒక పాటను పాడాడు. నిజానికి కేటీఆర్‌ బర్త్‌ డే కానుకగా జూలైలోనే హిమాన్షు ఓ పాటను పాడాడు. 

KTR Counter On Formula E Car Racing: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కౌంటర్, ప్రభుత్వ వాదన అర్ధరహితమంటూ కౌంటర్  

యానిమల్‌ మూవీలోని ‘ ఓ నాన్న నువ్వు నా ప్రాణం’ అనే పాటను రికార్డు చేశాడు. అయితే ఆ పాటను తాజాగా కేటీఆర్‌ ట్విట్టర్‌ (X) వేదికగా పంచుకున్నారు.

 

తన బర్త్‌ డే కానుకగా తన కొడుకు హిమాన్షు రావు ఈ పాటను పాడాడని పేర్కొన్నారు. కానీ అది సంతృప్తికరంగా రాలేదని భావించి విడుదల చేయలేదని చెప్పారు. అయితే ఆ పాటను తాను వారం క్రితం మొదటిసారి విన్నానని, హిమాన్షు గానం, పాటలోని సాహిత్యం అద్భుతంగా ఉందని తెలిపారు. ఈ కష్టతరమైన సంవత్సరంలో నాకు దక్కిన ఉత్తమ బహుమతి అని కేటీఆర్‌ హిమాన్షు పాడిన పాటను ప్రశంసించారు. తన గాత్రంతో ఉత్తమ బహుమతి అందించిన బింకు(హిమాన్షు)కి ధన్యవాదాలు తెలిపారు. ఓ తండ్రిగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు.