KTR Slams BJP: హైదరాబాద్‌ మెట్రోకు నిధులేవి, 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే ఇచ్చింది గుండు సన్నా?, తెలంగాణపై మోడీకి నిలువెల్లా విషమే,కేటీఆర్ ఫైర్

కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

KTR Slams BJP,Nothing for Hyderabad metro in Union Budget, Budget unfair

Hyd, July 27: గత పదేళ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్ట్ ల కోసం మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది.. కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగిన అన్యాయాన్ని మోడీకి వివరించి రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిధులు తేవాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన కేటీఆర్...బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చినా అదే వివక్షా? కొనసాగుతుందని మండిపడ్డారు. మొదటి నుంచి తెలంగాణపై ద్వేషం ప్రధాని మోడీ ద్వేషం నింపుకున్నారని ఆరోపించారు.

ఇదే కేంద్రం హైదరాబాద్ మెట్రోను విస్మరిస్తూ మిగతా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్ట్ లకు మాత్రం భారీగా నిధులు కేటాయించిందని లెక్కలతో సహా వివరించారు కేటీఆర్. ఉత్తర ప్రదేశ్ (4 ప్రాజెక్టులు) - రూ. 5,134.99 కోట్లు, మహారాష్ట్ర (3 ప్రాజెక్టులు) - రూ. 4,109 కోట్లు,గుజరాత్ (3 ప్రాజెక్టులు) - రూ. 3,777.85 కోట్లు,ఢిల్లీ (2 ప్రాజెక్టులు) - రూ. 3,520.52 కోట్లు,కర్ణాటక- రూ. 1880.14 కోట్లు,మధ్యప్రదేశ్ (2 ప్రాజెక్టులు) - రూ. 1,638.02 కోట్లు,బీహార్ - రూ. 1,400.75 కోట్లు,తమిళనాడు - రూ. 713 కోట్లు,కేరళ (2 ప్రాజెక్టులు) - రూ. 146.74 కోట్లు,రాపిడ్ రైల్ ప్రాజెక్ట్ (ఢిల్లీ-ఘజియాబాద్) - రూ. 1,106.65 కోట్లు కేటాయించిందని తెలిపారు.

సాబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నారన్నారని ఆగ్రహం వ్యకం చేశారు. ఎన్నిసార్లు తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని అడిగినప్పటికీ మోడీ పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ మెట్రో కోసం నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పెడచెవిన పెట్టారని మండిపడ్డారు.

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోడీ చేసిన కామెంట్స్ ఇప్పటికైన తెలంగాణ ప్రజలకు అర్ధం అయ్యాయని, ఆ పార్టీకి భవిష్యత్‌లో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారని కానీ ఏం ప్రయోజనం అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యలా కోమటిరెడ్డి? మేం 6 కోట్లే ఇస్తున్నాం, అందుకే పార్టీ మారడం లేదు?సంచలన కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి?



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif