KTR: అవినీతి జరగలేదని మంత్రులే చెప్పారు...ఈ కేసు నిలబడదన్న కేటీఆర్, అందరిని తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి...కేసులను లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పిన కేటీ రామారావు
అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్...ముఖ్యమంత్రిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు.
Hyd, December 20: ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్...ముఖ్యమంత్రిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు.
కేసులకు భయపడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. కేసులను లీగల్‌గానే ఎదుర్కొంటానని...ఈ కేసు న్యాయస్థానంలో నిలబడదన్నారు. సిట్ అంటేనే ఆయన కోసం పని చేసే అధికారులు ఉంటారు...ప్రమోషన్ కోసం పని చేయాల్సిన వారు ఉన్నారు..నేషనల్ హైవే వాళ్ళు పెట్టిన టిఓటి ప్రకారమే వెళ్ళాం తప్ప ఇంకోటి లేదు అన్నారు. కేస్ ఎవరికి అప్పగించాలో కూడా వారికి తెలియదు..50 లక్షల తో పట్టుబడిన వ్యక్తి ఎసిబి కిందికి వస్తుందన్నారు.
మంత్రులకు శిక్షణ తరగతులు పెట్టాలి.ఎమ్మెల్యేలకు పెట్టారు అందుకే చెప్పులు లేపారు.ఇదా వీరు ఇచ్చిన శిక్షణ చెప్పాలన్నారు.ఆనాడు ఇదే ముఖ్యమంత్రి ఎంపీగా ఉండి లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు దానికి హెచ్ఎండీఏ రేవంత్ రెడ్డి పై పరువునష్టం దావా వేశారు.అంతేకాదు ఇప్పుడు పదే పదే కుంభకోణం జరిగింది అని అన్నారు కదా.....మరి ఆ పర్మిషన్ రద్దు చేయాలి అన్నారు.అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం
ఓఆర్ఆర్ పై టిఓటి విధానంపై మేము 7400 కోట్లు తెచ్చి రైతు రుణమాఫీ చేశామన్నారు. టిఓటి ని పారదర్శకంగా చేశామని...ఆనాడు ఇదే ముఖ్యమంత్రి ఎంపీగా ఉండి లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు దానికి హెచ్ఎండీఏ రేవంత్ రెడ్డి పై పరువునష్టం దావా వేశారు.అంతేకాదు ఇప్పుడు పదే పదే కుంభకోణం జరిగింది అని అన్నారు కదా.....మరి ఆ పర్మిషన్ రద్దు చేయాలి కదా అన్నారు. ఓఆర్ఆర్ పై సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు.