Lok Sabha Elections: ఆ రెండు స్థానాలకు కూడా అభ్యర్ధులను ప్రకటించిన బీఆర్ఎస్, నల్లగొండ, భువనగిరి నుంచి వారి పేర్లు ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం
ఇక భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నుంచి క్యామ మల్లేశ్ (Kyma Mallesh) పేర్లను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారు. ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Hyderabad, March 23: భారత రాష్ట్ర సమితి (BRS)మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి (Kancharla Krishna Reddy) పేరును ప్రకటించింది. ఇక భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నుంచి క్యామ మల్లేశ్ (Kyma Mallesh) పేర్లను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారు. ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్ (Padmarao Goud) పేరును కేసీఆర్ ప్రకటించారు. శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరి ఏకాభిప్రాయం మేరకు ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు బీఆర్‌ఎస్ పార్టీ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా హైదరాబాద్ పార్లమెంట్‌కు అభ్యర్థిని ప్రకటించాలి. నాగర్‌కర్నూల్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మల్కాజ్‌గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు.