Medak Leopard: మెదక్ జిల్లాలో చిరుత హల్ చల్, పొలంలో దూడను తినేయడంతో, భయాందోళనలు..
వ్యవసాయ పొలంలో చిరుత దూడను చంపి తినేసింది.
మెదక్: మాసాయిపేట మండలం చెట్ల తమ్మాయి పల్లి గ్రామంలో చిరుతపులి సంచరించడంతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యవసాయ పొలంలో చిరుత దూడను చంపి తినేసింది. రైతు మాలోత్ కృష్ణ శనివారం తన వ్యవసాయ పొలంలోని షెడ్డులో పశువులను ఉంచాడు. ఆదివారం ఉదయం షెడ్డు వద్దకు తిరిగి వచ్చి చూసే సరికి అక్కడ సగం తిన్న కళేబరాలతో దూడ మృతి చెందింది. కృష్ణ అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి ఇతర రైతులను అప్రమత్తం చేసి ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని కోరారు. ఘటనాస్థలికి పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడారు. తిమ్మాయిపల్లి గ్రామం అటవీప్రాంతానికి సమీపంలో ఉన్నందున రాత్రి పూట రైతులు పొలాలు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు కోరారు.
Tags
Leopard
leopard (chirutha) hulchul in medak district
leopard attack in medak
leopard attacks in medak
leopard hulchul
leopard hulchul in medak
leopard hulchul in medak district
leopard in medak
leopard in medak district
leopard in medak news
leopard spotted in medak
leopard spotted in medak dist
leopard trapped
leopard trapped in cage
leopard trapped in cage at medak
leopard trapped in medak
medak
Medak district
medak leopard
medak news