Ponnam Prabhakar: కేసీఆర్, కిషన్ రెడ్డి ఇప్పటివరకు కుల సర్వేలో పాల్గొనలేదు, అభ్యంతరాలుంటే చెప్పాలి కానీ కుల సర్వేపై అసత్య ప్రచారం తగదన్న మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందని... రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ,అధికారులు , ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ నీ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న అన్నారు.

Minister Ponnam Prabhakar appeals politicians to participates Samagra Kutumba Survey(video grab)

Hyd, Dec 6:  రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొనాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందని... రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ,అధికారులు , ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ నీ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న అన్నారు.

రాజకీయాలు లేవు గతంలో టిఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చాము అన్నారు. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు అన్నారు.

రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వే కు సహకరించాలని...సమాచారాన్ని ఇవ్వకుండా బీసీ లకు వ్యతిరేకంగా ఈ సర్వే నిర్వహణకు వ్యతిరేకంగా మీలో భావం ఉంటే చెప్పండన్నారు. ప్రభుత్వం తీసుకున్న సర్వే లో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు అన్నారు. సమాచార శాఖలో మీరు భాగస్వాములై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అన్నారు.  కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్...స్వయం సహాయక బృందాలను మరింత బలోపేతం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి 

ఎవరైనా రాకపోతే పోస్టులు పెట్టీ విమర్శించడం కాదు...సమాచార లోపం తో ,అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యతగల వాళ్లుగా మరియు ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం.. అందరూ సమాచారాన్ని ఇవ్వండి ఈ సర్వే లో పాల్గొనండని విజ్ఞప్తి చేశారు.



సంబంధిత వార్తలు

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు