MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో 5గురికి నోటీసులు, విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన సిట్

ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన సిట్ (SIT) మరో అయిదుగురికి తాజాగా నోటీసులు జారీ చేసింది.

MLAs Poaching Case (Photo-ANI)

Hyd, Nov 25: తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (MLAs Poaching Case) సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన సిట్ (SIT) మరో అయిదుగురికి తాజాగా నోటీసులు జారీ చేసింది. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్‌లోపాటు సిబ్బంది శరత్‌, ప్రశాంత్‌, విమల్‌, ప్రతాపన్‌కు నోటీసులు ఇచ్చింది. వీరందరికీ 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్, బీజేపీ నేత సంతోష్‌తో పాటు జగ్గు స్వామికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు

ఇక ఎమ్మెల్యేలకు ఎర కేసులోని (TRS MLAs Poaching Case) ముగ్గురు నిందితుల రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు వచ్చేనెల 9 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నంద కుమార్ భార్య చిత్ర లేఖ, న్యాయవాదులు ప్రతాప్‌ గౌడ్‌, శ్రీనివాస్‌లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలపై సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు.. ప్రతాప్ గౌడ్, నందకుమార్ ట్రాన్సెక్షన్‌పై విచారిస్తున్నారు. రామచంద్ర భారతి, సింహయాజులు తో పరిచయాలపై ప్రశ్నిస్తున్నారు.



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌