Telanagana Civic Polls: టాప్ గేర్‌లో వెళ్తున్న టీఆర్ఎస్ కార్, ఎన్నికలకు ముందే 84 స్థానాలు ఏకగ్రీవం, గురువారానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం, పట్టణాల్లో వినూత్న ప్రచారంతో ముందజలో ఉన్న అధికార పార్టీ, విపక్షాలకు అభ్యర్థుల కరువు
అక్కడ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది జనవరి 16. ఇక్కడ కూడా ఇంకెన్ని ఏకగ్రీవం అవుతాయో గురువారం తేలనుంది.....
Hyderabad, January 15: మ్యాచ్ ప్రారంభం కాకముందే, బాల్ పడక ముందే స్కోర్ చేసినట్లు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Polls) పోలింగ్ ప్రారంభానికి ముందే అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీ ఖాతా తెరిచి సెంచరీ దిశగా దూసుకుపోయింది. ఇప్పటికే 80కి పైగా స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా (unanimously) ఎన్నికయ్యారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరఫున కనీసం పోటీచేసేందుకు అభ్యర్థులు కరువవుతుండగా, ఇటు వైపు టీఆర్ఎస్ పార్టీ మరోసారి ఎన్నికల్లో తన ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తుంది.
చివరి రోజైన మంగళవారం నామినేషన్లు ఉపసంహరించుకున్న తరువాత, 35 పట్టణ స్థానిక సంస్థలలో కనీసం 84 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, అందులో 3 స్థానాలలో (నిర్మల్ పురపాలక సంఘంలో) ఎంఐఎం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం.
ఇక సుమారు 700 వార్డుల్లో బిజెపికి, అలాగే సుమారు 400 వార్డులలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని టీఆర్ఎస్ కార్యదర్శి గట్టు రామ్‌చందర్ రావు చెప్పారు. కాంగ్రెస్- బిజెపి నాయకులు కుమ్మక్కై, టీఆర్ఎస్ ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ, రాహుల్ ఎవరైనా మాకు భయం లేదు, లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ రియాక్షన్
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని కారు గుర్తులతో కూడిన గులాబీ పతంగులను ఎగరవేస్తున్నారు. తమ ఇంటి ముందు కూడా కారు గుర్తులతో, కేసీఆర్ - కేటీఆర్ చిత్రాలతో రంగవల్లులు వేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా సందేశాలు రాస్తున్నారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ మహిళా విభాగం 200 ఎకరాల్లో కారు గుర్తు ఆకారంలో భారీ రంగవల్లిని వేసి తమ పార్టీకి ప్రచారాన్ని కల్పిస్తున్నారు.
TRS Election Campaign:
ఇదిలా ఉండగా, 120 మునిసిపాలిటీలలో 2,727 వార్డులు, కరీంనగర్ మినహా తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లలోని 325 డివిజన్లతో పాటు, 129 పట్టణ స్థానిక సంస్థలలో 3,052 వార్డులకు జనవరి 22న ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 19,673 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీటన్నింటికీ జనవరి 25న ఓట్ల లెక్కింపు, ఆ తరువాత ఫలితాల ప్రకటన జరుగుతుంది. కరీనంగర్ కార్పోరేషన్ లో మాత్రం జనవరి 24న ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది జనవరి 16. ఇక్కడ కూడా ఇంకెన్ని ఏకగ్రీవం అవుతాయో గురువారం తేలనుంది.