Komatireddy Rajgopal Reddy Arrest: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అరెస్ట్, అధికారం శాశ్వతం కాదని తామేంటో చూపిస్తామని టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చిన మునుగోడు ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ.. రాజగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

Komatireddy Rajgopal Reddy (Photo-Twitter)

Hyderabad, July 28: తెలంగాణలో మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ.. రాజగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రాజగోపాల్‌ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను అరెస్ట్‌ (Komatireddy Rajgopal Reddy Arrest) చేశారు.

గత సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రొటోకాల్ విషయంలో మంత్రి జగదీష్ రెడ్డి (minister jagadish reddy), మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ మధ్య వివాదం జరిగింది. మునుగోడు నియోజక వర్గానికి వస్తే అడ్డుకుంటామన్నారు. దీనిపై మంత్రి ప్రతి సవాల్ విసిరారు. మునుగోడు నియోజకవర్గానికి వస్తానని, అన్ని గ్రామాలు తిరుగుతానని అన్నారు. ఇవాళ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం మంత్రి మునుగోడు వచ్చారు.

తెలంగాణలో నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో లాంఛనంగా ప్రారంభించనున్న పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

ఈ నేపథ్యంలో రాత్రి నుంచి పోలీసులు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బెంగళూర్ టోల్ ప్లాజా వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్భందాలు చేయడం సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదని.. త్వరలో తామేంటో చూపిస్తామన్నారు. పోలీసుల చర్యలపై రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ మొత్తం అమలు చేయాలని రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.



సంబంధిత వార్తలు