New Service at Mee Seva: ఇకపై పహాణీ కాపీల కోసం ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు, తాజాగా మరో 9 కొత్త సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
‘మీసేవ’లో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లుగా తాసిల్దార్ కార్యాలయంలో మాన్యువల్‌గా అందిస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్‌ఏ కార్యాలయం ప్రకటించింది.
Hyderabad, AUG 30: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మీసేవ’లో (Mee Seva) మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లుగా తాసిల్దార్ కార్యాలయంలో మాన్యువల్‌గా అందిస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్‌ఏ (CCLA) కార్యాలయం ప్రకటించింది. కొత్తగా.. గ్యాప్ సర్టిఫికెట్, పౌరుల పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికెట్, మరోసారి సర్టిఫికెట్ల జారీ (Re Issue), క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు, మార్కెట్ విలువపై సర్టిఫైడ్ కాపీ, పాత రికార్డుల కాపీలు (ఖాస్రా/సెస్సాలా పహాణీ), 1బీ సర్టిఫైడ్ కాపీలు ఇకపై ఆన్‌లైన్‌లో మీసేవ ద్వారా అందజేయనున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సేవలకు మరో 9 సేవలను చేర్చడంతో ఇకపై ప్రజలకు మరింత సులువు కానుంది. డిజిటల్ లైఫ్ లో ఈ నిర్ణయం మేలు చేకూరుస్తుందని ప్రజలంటున్నారు