Parliament Winter Session: ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన, ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్, రాజ్యసభ రేపటికి వాయిదా
ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ రేపటికి వాయిదాపడగా.. లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతున్నది. పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బైఠాయించారు.
పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన స్వరం పెంచారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ రేపటికి వాయిదాపడగా.. లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతున్నది. పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బైఠాయించారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాసివున్న ఫ్లకార్డులు ప్రదర్శించారు. టీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో లోక్‌సభ హోరెత్తింది.తెలంగాణ రైతాంగాన్ని న్యాయం జరిగేవరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టంచేశారు.