PM Modi Warangal Tour: భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ.. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని.. వీడియోతో

చారిత్రక ఓరుగల్లులో (Warangal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటన మొదలైంది. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన ప్రధాని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Credits: Twitter

Warangal, July 8: చారిత్రక ఓరుగల్లులో (Warangal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటన మొదలైంది. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన ప్రధాని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అనంతరం వరంగల్ లోని భద్రకాళీ ఆలయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధానికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సుమారు పది నిమిషాల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి బయలుదేరి వెళ్లారు. ప్రధాని రాక సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా ప్రసాదాలు తయారుచేసిన అర్చకులు.. వాటిని ప్రధానికి అందజేసి, ఆశీర్వదించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో వరంగల్ లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. సుమారు 3,500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే సిటీలో పహారా పెంచారు. హోటళ్లతో సహా అన్ని దుకాణాలు మూసివేయించారు. ప్రధాని పర్యటించే రూట్ లో ట్రాఫిక్ ను మళ్లించిన పోలీసులు ఆ మార్గంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

PM Modi Warangal Tour: ఓరుగల్లుకు బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ.. కాసేపట్లో భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా..

ఏర్పాట్లు పూర్తి

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ పర్యటనలో భాగంగా కాజీపేట (Kazipet) అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ (Wagon industry) పీవోహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ. 6,109 కోట్ల అభివృద్ధి పనులకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచే ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే జరిగే ‘విజయ సంకల్ప సభ’లోమోదీ పాల్గొంటారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రులు నితిన్ గఢ్కరీ, కిషన్ రెడ్డిలు పాల్గొంటారు.

PM Modi Warangal Tour: ఓరుగల్లుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ.. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా.. 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement