PM Narendra Modi (Photo Credit: ANI)

Warangal, July 8: చారిత్రక ఓరుగల్లులో (Warangal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన కాసేపటి క్రితం హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అనంతరం వరంగల్ కు పయనమవుతారు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ పర్యటనలో భాగంగా కాజీపేట (Kazipet) అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ (Wagon industry) పీవోహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ. 6,109 కోట్ల అభివృద్ధి పనులకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచే ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే జరిగే ‘విజయ సంకల్ప సభ’లోమోదీ పాల్గొంటారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రులు నితిన్ గఢ్కరీ, కిషన్ రెడ్డిలు పాల్గొంటారు.

PM Modi Warangal Tour: ఓరుగల్లుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ.. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా.. 

పటిష్ఠ భద్రత

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆర్ట్స్ కాలేజీ చుట్టూ 20 కిలోమీటర్ల వరకు నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. పీఎం సెక్యూరిటీ చూసే ఎస్పీజీ దళాలకు తోడు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అడిషనల్ డీజీపీల పర్యవేక్షణలో సుమారు పదివేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గోనున్నారు.

PM Modi in Varanasi: ఒక కుటుంబం కోసం కాదు, భవిష్యత్ తరాల బాగు కోసమే పథకాలు తీసుకొచ్చాం, వారణాసిలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అమ్మవారికి  ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 15నిమిషాల పాటు ప్రధాని అక్కడే ఉంటారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో రెండు వేదికలను ఏర్పాటు చేశారు. మొదటి వేదికలో ప్రధాని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనుండగా, రెండో వేదికపై బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ప్రజలు మోదీ ప్రసంగాన్ని తిలకించేందుకు ప్రత్యేకంగా 30 ఎల్ ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.

PM Modi in UP: సావన్ పండుగ సందర్భంగా కాశీకి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారు, యూపీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా..

  • ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి ప్రధాని మోదీ బయలుదేరారు. 9.25గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
  • 9.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 10.15 గంటలకు మామునూర్ హెలిప్యాడ్ కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు.
  • అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రకాళి టెంపుల్ కు 10.30 గంటలకు చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 10.45 గంటల వరకు ప్రధాని ఆలయంలో ఉంటారు.
  • 10.50 గంటలకు భద్రకాళి దేవాలయం నుంచి బయలుదేరి 11గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుంటారు.
  • 11.35 గంటల వరకు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.
  • 11.45 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.20 వరకు ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు.
  • మధ్యాహ్నం 12.25 గంటలకు మోదీ రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు.
  • 1.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3.25 గంటలకు రాజస్థాన్ లోని బికనీర్ కు ప్రధాని వెళ్తారు.

PM Modi in Uttar Pradesh: రూ.12,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, వీడియో ఇదిగో..