Degree Colleges Bandh Today: తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధిక బంద్‌.. కారణం ఏంటంటే?

గడిచిన రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు తెలిపాయి.

Colleges Bandh (Credits: X)

Hyderabad, Nov 19: తెలంగాణలోని (Telangana) ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కాలేజీలు (Degree Colleges Bandh Today) నేటి నుంచి (మంగళవారం) నిరవధికంగా బంద్‌ కానున్నాయి. గడిచిన రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్​మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు తెలిపాయి. గత బీఆర్ఎస్ సర్కారుతో పాటు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని వాపోయాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ జిట్టా బాలకిష్టారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

‘కాగ్’ చీఫ్ గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌ మూర్తి.. సంజయ్‌ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ

బంద్ అందుకే..

దసరా సెలవుల తర్వాత అక్టోబర్ చివరికల్లా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు గుర్తుచేశాయి. అయితే, ఆ హామీ ఇంకా అమలుకు నోచుకోకపోవడంతోనే కళాశాలలను బంద్ చేస్తున్నామని వెల్లడించాయి.

తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ, పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..