Hyd Car Rash Driving Case: ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసును పక్కదోవ పట్టించిన పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్‌, భోదన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సొహైల్‌పై లుక్ అవుట్ నోటీసులు

హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్‌ వద్ద ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో (Hyd Car Rash Driving Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్‌ (Punjagutta CI durga rao suspended) అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు

Punjagutta CI durga rao suspended in praja bhavan car rash driving case (photo-X)

Hyd, Dec 27: హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్‌ వద్ద ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో (Hyd Car Rash Driving Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్‌ (Punjagutta CI durga rao suspended) అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. కాగా, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి వ్యక్తులన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సొహైల్‌ మార్చేసిన విషయం తెలిసిందే.

ప్రజాభవన్‌ వద్ద ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసును (praja bhavan car rash driving case) పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ అని నిర్ధారించారు. ప్రధాన నిందితుడిగా సోహైల్‌ను చేర్చటమే కాకుండా.. అతనిపై 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ప్రజా భవన్‌ వద్ద బారికేడ్లను ఢీ కొట్టింది బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకే, వివరాలను వెల్లడించిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్

ఈ ఘటనలో సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అనుచరులు పీఎస్‌కు వచ్చారు. షకీల్‌ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ.. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గరావు‌ను సస్పెండ్ చేశారు.

ఘటన జరిగిన రోజున (డిసెంబర్ 24న) నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావుతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది.. సోహైల్‌ను తప్పించి వేరే వ్యక్తి పేరును చేర్చారంటూ.. పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో.. అధికారులు వారిపై విచారణ చేపట్టారు. వెస్ట్ జోన్ డీసీపీ పూర్తి స్థాయిలో విచారిస్తున్న క్రమంలో దుర్గారావు అస్వస్థతకు గురయ్యారు. బీపీ డౌన్ కావటంతో.. దుర్గారావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో దుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.కాగా ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించడంతో.. పోలీసుల నిర్వాకం బయటపడింది.

ఇక బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహైల్‌పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రమాదం చేసిన సోహెల్ నేరుగా ముంబకి వెళ్లిపోయాడు. అటునుంచి దుబాయ్ కి పారిపోయాడు. సోహెల్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు.. దుబాయ్ లో ఉన్న సోహెల్ ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

కాగా ఈ నెల 23న ప్రజాభవన్‌ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్‌ను తప్పించి మరొకరు డ్రైవ్‌ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్‌ సీపీ విచారణకు ఆదేశించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

Telangana Horror: చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..

Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా.. ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్‌ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Share Now